1925 - 2025 * శతవసంతాల జీవన ప్రస్థానమూర్తులు , భరతమాత ముద్దుబిడ్డలు - సంఘటనలు

శత వసంత ప్రాభవం/సారస్వత మూర్తులు - 1925 - 2025 

*1925 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము. సంఘటనలు

*1925: విశాఖపట్నంలో ఆంధ్ర విశ్వవిద్యాలయం స్థాపించబడింది.



# జననాలు
 
జనవరి 25: కాకర్ల సుబ్బారావు, రేడియాలజిస్ట్, హైదరాబాదు నిమ్స్ ఆసుపత్రి పూర్వ డైరెక్టర్.
జనవరి 25: పి. అచ్యుతరాం, హేతువాది, సంఘ సంస్కర్త. (మ.1998)
ఫిబ్రవరి 20: గిరిజాప్రసాద్ కొయిరాలా, నేపాల్ మాజీ ప్రధానమంత్రి.
ఏప్రిల్ 7: కాపు రాజయ్య, తెలంగాణ రాష్ట్రానికి చెందిన చిత్రకారుడు. (మ.2012)


ఏప్రిల్ 12: అట్లూరి పిచ్చేశ్వర రావు, కథకుడు, అనువాదకుడు, నవలా రచయిత, సాహిత్యవేత్త. (మ.1966)
మే 29: భండారు సదాశివరావు, రచయిత, సంపాదకుడు, ఆర్.ఎస్.ఎస్. ప్రచారకుడు. (మ.2010)
జూలై 22: దాశరథి కృష్ణమాచార్య, తెలంగాణ ప్రజల కన్నీళ్లను 'అగ్నిధార'గా మలిచి నిజాం పాలన మీదికి ఎక్కుపెట్టిన మహాకవి. (మ.1987) 
ఆగష్టు 1: చల్లా కృష్ణనారాయణరెడ్డి, హైదరాబాదు‌ బుక్‌ ట్రస్ట్‌ వ్యవస్థాపకులు, మాజీ శాసన సభ్యులు. (మ.2013)
ఆగష్టు 18: సుభద్రా శ్రీనివాసన్, ఆకాశవాణి కార్యక్రమ నిర్వాహకురాలు. (మ.1972)


ఆగష్టు 19: అట్లూరి పుండరీకాక్షయ్య, తెలుగు సినిమా నిర్మాత, రచయిత, నటుడు. (మ.2012)
ఆగష్టు 31: ఆరుద్ర, కవి, గేయరచయిత, సాహితీవేత్త, కథకుడు, నవలారచయిత, విమర్శకుడు, పరిశోధకుడు, అనువాదకుడు. (మ.1998)


ఆగష్టు 7: ఎం.ఎస్.స్వామినాథన్, జన్యుశాస్త్రవేత్త, అంతర్జాతీయంగా పేరొందిన "హరిత విప్లవం" నిర్వాహకుడు.
సెప్టెంబర్ 7: భానుమతి, దక్షిణ భారత సినిమా నటి, నిర్మాత, దర్శకురాలు, స్టూడియో అధినేత్రి, రచయిత్రి, గాయని, సంగీత దర్శకురాలు. (మ.2005)


సెప్టెంబర్ 12: జోలెపాళ్యం మంగమ్మ, ఆకాశవాణి మొట్టమొదటి మహిళా న్యూస్ రీడర్ (మ.2017)


అక్టోబర్ 18: ఇబ్రహీం అల్కాజీ, నాటకరంగ దర్శకుడు, నట శిక్షకుడు, నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా (ఎన్ఎస్‌డీ) మాజీ డైరెక్టర్ (మ.2020)
అక్టోబర్ 21: సూర్జీత్ సింగ్ బర్నాలా, రాజకీయ నాయకుడు, పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి. (మ.2017)
అక్టోబర్ 31: కె.ప్రత్యగాత్మ, తెలుగు సినిమా దర్శకుడు, నిర్మాత. (మ.2001)
నవంబర్ 2: అబ్బూరి కమలాదేవి, తెలుగు రంగస్థల నటి. పురుష పాత్రలు ధరించడంలో పేరు పొందింది.




నవంబర్ 3: ఏల్చూరి విజయరాఘవ రావు, భారతీయ సంగీతకారుడు, వేణుగాన విద్వాంసుడు, సంగీత దర్శకుడు, రచయిత. (మ.2011)


నవంబర్ 5: ఆలూరి బైరాగి, తెలుగు కవి, (మ.1978)
నవంబర్ 12: పసుమర్తి కృష్ణమూర్తి, చలనచిత్ర నృత్యదర్శకుడు. (మ.2004)

నవంబర్ 13: టంగుటూరి సూర్యకుమారి, తెలుగు సినిమా నటి, గాయకురాలు. (మ.2005)

నవంబర్ 20: చుక్కా రామయ్య, విద్యావేత్త, సామాజిక ఉద్యమకారుడు, శాసనండలి సభ్యుడు.


డిసెంబర్ 12: కానేటి మోహనరావు, కమ్యూనిస్టు పార్టీకి చెందిన పార్లమెంటు సభ్యుడు, భారత స్వాతంత్ర్య సమరయోధుడు. (మ.2014)
డిసెంబర్ 15: ఎస్.వి.భుజంగరాయశర్మ, కవి, విమర్శకుడు, నాటక రచయిత. (మ.1997)

*మరణాలు

జూన్ 16: చిత్తరంజన్ దాస్, భారత స్వాతంత్ర్య్య పోరాట నాయకుడు.

ఆగష్టు 6: సురేంద్రనాథ్ బెనర్జీ, భారత జాతీయోద్యమ నాయకుడు. (జ.1848)
*పురస్కారాలు

1925 - 2025 * శతవసంతాల జీవన ప్రస్థానమూర్తులకు, భరతమాత ముద్దుబిడ్డలకు, వారు అందించిన వివిధ రంగాలలో సేవలు చిరస్మరణీయం. శతసహస్ర నమస్సులతో. 
కొంపెల్ల శర్మ - తెలుగురథం (2008-2025)  



Comments

Popular posts from this blog

తెలుగు-సారస్వత ప్రతిభా మూర్తిమంతం - శతజయంతి ఉత్సవ కదంబం ** (1926-2026)