శత-వసంత-సారస్వత-మూర్తిమంతులు

 శత-వసంత-సారస్వత-మూర్తిమంతులు 

దాశరథి కృష్ణమాచార్యులు

(22-7-1925 * 5-11-1987)

శతజయంతి - 22-7-1924 - 1925)

దాశరథి గా పేరు గాంచిన దాశరథి కృష్ణమాచార్యలు గారు(జూలై 221925 - నవంబర్ 51987) తెలంగాణకు చెందిన కవి, రచయిత. నిజాం ప్రభువును ఎదిరిస్తూ రచనలు చేశాడు. తెలంగాణ విముక్తి కోసం కృషి చేశాడు. నా తెలంగాణ కోటి రతనాల వీణ అని గర్వంగా ప్రకటించి తెలంగాణ ఉద్యమానికీ ప్రేరణనందించిన కవి దాశరథి. పలు సినిమాలకు గేయరచయితగా పనిచేశాడు. ప్రతి సంవత్సరం దాశరథి జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో సాహిత్యరంగంలో కృషిచేసినవారికి తెలంగాణ ప్రభుత్వం దాశరథి సాహితీ పురస్కారం అందజేస్తోంది

దాశరథి కృష్ణమాచార్య 1925 జూలై 22  మహబూబాబాద్ జిల్లా చిన్న గూడూరు గ్రామంలో జన్మించాడు. ప్రస్తుతం ఈ గ్రామం మహబూబాబాద్ జిల్లాలో ఉంది. బాల్యం ఖమ్మం జిల్లా మధిరలో గడిచింది. ఉర్దూలో మెట్రిక్యులేషను, భోపాల్ విశ్వవిద్యాలయం నుండి ఇంటర్మీడియెట్ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి ఇంగ్లీషు సాహిత్యంలో బి.ఎ చదివాడు. సంస్కృతంఆంగ్లంఉర్దూ భాషల్లో మంచి పండితుడు. చిన్నతనంలోనే పద్యం అల్లటంలో ప్రావీణ్యం సంపాదించాడు. ప్రారంభంలో కమ్యూనిస్టు పార్టీ సభ్యుడిగా ఉండి రెండో ప్రపంచయుద్ధం సమయంలో ఆ పార్టీ వైఖరి నచ్చక ఆ పార్టీ నుంచి బయటకు వచ్చి హైదరాబాదు సంస్థానంలో నిజాం అరాచక ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమంలో పాలుపంచుకున్నాడు. 


 


Comments

Popular posts from this blog

తెలుగు-సారస్వత ప్రతిభా మూర్తిమంతం - శతజయంతి ఉత్సవ కదంబం ** (1926-2026)

1925 - 2025 * శతవసంతాల జీవన ప్రస్థానమూర్తులు , భరతమాత ముద్దుబిడ్డలు - సంఘటనలు